
భారత్‌లో బ్రిటీషర్లు నిర్మించిన ఏకైక ఆలయం ఎక్కడుందో తెలుసా?
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా అగర్ మాల్వాలో ఉన్న బైద్యనాథ్ మహాదేవ్ ఆలయం ఒక అద్భుతమైన చరిత్రను కలిగి ఉంది. 1880లో కల్నల్ మార్టిన్ అనే బ్రిటీష్ అధికారి ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధానికి వెళ్ళినప్పుడు, అతని భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. ఒక శివాలయంలో పూజారి ఆమెకు శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆమె భక్తితో జపించగా, 11వ రోజు కల్నల్ మార్టిన్ సురక్షితంగా తిరిగి వచ్చాడు. యుద్ధంలో పులిచర్మం ధరించిన ఒకతను తనను రక్షించాడని అతను చెప్పాడు. ఈ సంఘటనతో దంపతులు శివుడి భక్తులై, శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని తమ ధనంతో పునఃర్నిర్మించారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.




