
నిర్మల్లో నేడు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
మొక్కజొన్న, వడ్ల కొనుగోలులో జాప్యం వహిస్తూ రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నిర్మల్లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా ఉంటుందని నాయకులు తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ఉదయం 9 గంటలకు ధర్నా ఉంటుందని కార్యకర్తలు, రైతులు పాల్గొనాలని కోరారు.






























