ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరువు పోరు

1896చూసినవారు
ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరువు పోరు
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అగ్రనేతలకు సవాలుగా మారాయి. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలకు ఈ ఎన్నికలు పరువు పోరాటంగా మారాయి. చెన్నూరులో బీఆర్ఎస్ బలపడటం, అంతర్గత విభేదాలు పార్టీని కలవరపెడుతున్నాయి. మంచిర్యాల, నిర్మల్, భైంసా వంటి ప్రాంతాల్లోనూ ఆధిపత్యం నిరూపించుకోవాల్సిన బాధ్యత నేతలపై ఉంది. కొత్త డీసీసీ అధ్యక్షుల రాజకీయ భవిష్యత్తు కూడా ఈ ఫలితాలపైనే ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల పోరు నేతలకు 'చావో రేవో' అన్నట్లుగా మారింది.

సంబంధిత పోస్ట్