ఇంద్రవెల్లి మండలం ఏమయికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని రమాయినగర్ లో శనివారం భార్యాభర్తల గొడవతో మనస్థాపం చెందిన రాందాస్ (38) అనే వ్యక్తి క్షణికావేశంతో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.