కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, కుంటాల మండలానికి చెందిన గుద్దేటి హన్మండ్లు ఇరాక్ యుద్ధ క్షేత్రం నుంచి సురక్షితంగా తన స్వగ్రామానికి చేరుకున్నారు. గత 14 ఏళ్లుగా ఇరాక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన, పెరుగుతున్న డ్రోన్ దాడుల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం సహాయంతో ఈ నెల 4వ తేదీన స్వదేశానికి వచ్చారు. ఆయన ఇంటికి చేరుకున్న మరుసటి రోజే ఆయన పనిచేస్తున్న కంపెనీపై బాంబు దాడి జరగడం గమనార్హం. హన్మండ్లు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.