దహెగాం మండలంలోని రాళ్ళగూడ గ్రామానికి చెందిన ఆత్మకూరి కళావతి అనుమానస్పద మృతి కేసులో రూరల్ సీఐ కుమారస్వామి శుక్రవారం నిందితుడు వగాడే బడేరామ్‌ను అరెస్టు చేశారు. కళావతి బడేరామ్ వద్ద రూ.40 వేలు అప్పు తీసుకుంది. డబ్బుల విషయంలో జరిగిన గొడవల్లో బడేరామ్ ఆమెను చంపుతానని బెదిరించినట్లు సమాచారం. ఈ నెల 28న కళావతి ఇట్యాల ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.