2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఘాట్లు, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసి, 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, సమన్వయం కోసం ప్రత్యేక 'వార్ రూమ్' ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.