పిట్టబొంగురంలో ఉచిత వృత్తి శిక్షణపై అవగాహన సదస్సు

4చూసినవారు
పిట్టబొంగురంలో ఉచిత వృత్తి శిక్షణపై అవగాహన సదస్సు
ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగురం గ్రామంలో SBI RSETI ఉట్నూర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, మహిళలకు ఉచిత వృత్తి శిక్షణా కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. RSETI డైరెక్టర్ లక్ష్మీ నరసింహరావు మాట్లాడుతూ, గ్రామీణ యువత, మహిళలు తమ ఆసక్తికి అనుగుణంగా వృత్తి శిక్షణ పొందడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని, శిక్షణ అనంతరం ఉపాధి లేదా స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు RSETI ఉట్నూర్‌ను సంప్రదించి శిక్షణ వివరాలు తెలుసుకుని నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంద్రదేవ్, RSETI డైరెక్టర్ లక్ష్మీ నరసింహరావు, ఫ్యాకల్టీ ఆశన్న, DRDA అధికారులు, మహిళా గ్రూప్ సభ్యులు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్