జన్నారం మండలం ప్రాథమిక పాఠశాల పొనకల్ లో ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు బోధిస్తున్న బి వనిత మండల ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన సందర్భంగా ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. వారు మాట్లాడుతూ నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, అనునిత్యం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ, వినూత్న పద్ధతులతో బోధనను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ, మునుముందు జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులనుగా అవార్డుకు అర్హత సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన బి. వనితకు ప్రత్యేక శుభాకాంక్షలను మండల ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు తెలిపారు.