యూపీఐ చెల్లింపులపై చార్జీలు విధించడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ
కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం మాట్లాడుతూ 2016లో నోట్ల రద్దు సమయంలో డిజిటల్
ఇండియా పేరుతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించారని, ప్రజలు రోజువారీ అవసరాలకు యూపీఐనే వాడుతున్నారని తెలిపారు. ఇప్పుడు వ్యక్తి నుంచి వ్యాపారికి రూ. 2 వేలు దాటితే 0.4 శాతం ఎండీఆర్ పేరుతో, రూ. 75 వేలు దాటితే గరిష్టంగా రూ. 300 వరకు అక్టోబర్ 15 నుంచి వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.