జన్నారం మండలం పోనకల్ గ్రామంలోని షాలోమ్ చర్చిలో మంగళవారం జరిగిన కృతజ్ఞత కూడికకు
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీరా నందునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రైస్తవంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండకూడదని, కరుణ, దయ, ప్రేమతో జీవించాలని అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు. అనంతరం పాస్టర్లను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు
కాంగ్రెస్ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు.