ప్రతిపక్షాల తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దు

3చూసినవారు
ప్రతిపక్షాల తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దు
ఖానాపూర్ పట్టణంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ప్రతిపక్షాల తప్పుడు మాటలు నమ్మి మోసపోవద్దని, అధికారపార్టీకి ఓటేసి అభివృద్ధి చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ. 15 కోట్ల పనులతో పట్టణంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :