మస్కాపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జనాలు

0చూసినవారు
మస్కాపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జనాలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జనాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో పలు మండపాలలో గణపతులను ప్రతిష్టించారు. వేదపండితులుతో పూజలు, కుంకుమ పూజలు, అన్నదానం కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. డీజే పాటలకు మహిళలు, యువకులు, నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గోని వినాయకుడీని ఆటపాటలతో సంతోషపరచి మళ్ళీ సంవత్సరం రావాలని వేడుకుంటు గంగమ్మ ఒడిలోకి చేర్చి వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్