ఖానాపూర్ మండలం పాత ఎల్లపూర్ గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి బుధవారం డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేశారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.