నిర్మల్ జిల్లాలో అక్రమ ఇసుక టిప్పర్ పట్టివేత

2చూసినవారు
నిర్మల్ జిల్లాలో అక్రమ ఇసుక టిప్పర్ పట్టివేత
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పరిధిలోని జన్నారం మండలం చింతగూడలో బుధవారం అటవీశాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతి పత్రాలు లేని కారణంగా ఈ వాహనాన్ని సీజ్ చేసినట్లు జన్నారం రేంజ్ అధికారి బాబా ఖాదర్ వలీ తెలిపారు. ఈ టిప్పర్ రమేష్ రావు, ఓర్సు మల్లేష్, రాజమల్లుకు చెందినదని గుర్తించారు. నిబంధనల ప్రకారం తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్