జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈవో రాహుల్ తెలిపారు. గురువారం పోన్కల్ అనుబంధ పాత పుట్టిగూడా గ్రామంలో పాలైన బోర్లను గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి బాగు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు సురక్షితమైన నీరు అందించే ప్రయత్నంలో భాగంగా పాడైన బోరును బాగు చేయించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.