జన్నారం మండలం టీజీపల్లి గ్రామానికి చెందిన పెరిక సంఘం మండల అధ్యక్షులు, నాయకులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులమత బేధాలు లేకుండా ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు.