సింగరేణి థర్మల్ ప్లాంట్ ను సందర్శించిన ఖానాపూర్ BRS నేతలు

0చూసినవారు
సింగరేణి థర్మల్ ప్లాంట్ ను సందర్శించిన ఖానాపూర్ BRS నేతలు
ఖానాపూర్ నియోజకవర్గ BRS ఇన్‌చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్, BRS నేతలతో కలిసి చెన్నూరు జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను గురువారం సందర్శించారు. బోథ్ MLA అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ MLA కోవా లక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ విప్ బాల్క సుమన్, మాజీ MLAలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప లతో కలిసి ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా, సామర్థ్యాన్ని పరిశీలించారు. 1200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ పూర్తి స్థాయిలో నడవకపోవడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ లోనే ఇలా ఉంటే రైతులు, ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్