ఖానాపూర్: వలలో చిక్కుకొని జాలరి దుర్మరణం

852చూసినవారు
ఖానాపూర్: వలలో చిక్కుకొని జాలరి దుర్మరణం
ఆదివారం సాయంత్రం ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామంలో చేపలు పట్టేందుకు కడం చెరువులోకి వెళ్లిన మత్స్యకారుడు ఆర్మూరి రవి, వలలో చిక్కుకొని చెరువులో మునిగి మృతి చెందాడు. తెప్పపై నుంచి జారి చెరువులో పడిపోయిన రవి కాళ్లకు వల చుట్టుకోవడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.