ఖానాపూర్ పట్టణంలో అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ, నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో ఆశావాహులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ను సోమవారం నిలదీశారు. గత రెండేళ్లుగా ఇళ్ల కోసం తిరుగుతున్నా ఫలితం లేదని, విచారణలో కాలయాపన చేస్తూ అనర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.