కడెం ప్రాజెక్టు నుండి ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, గురువారం ప్రాజెక్టులో 695 అడుగుల నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 230 క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో ఎడమ కాలువకు 637, కుడి కాలువకు 8, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 737 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.