నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.