మేడే గోడ ప్రతులు ఆవిష్కరణ

402చూసినవారు
మేడే గోడ ప్రతులు ఆవిష్కరణ
ఖానాపూర్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో 140వ మేడే గోడ ప్రతులను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సునారికారి రాజేష్ మాట్లాడుతూ, చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికులను ఉరితాడుగా మార్చిందని ఆయన మండిపడ్డారు. మేడే కార్యక్రమాన్ని అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్