కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో వైద్య
పరీక్షలు, ఆరోగ్య సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య
పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్త
పరీక్షలు, బీపీ, షుగర్
పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన మందులు వాడాలని సూచించారు. సుమారు 60 మంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో వైద్య సేవలు పొందారు. గ్రామ సర్పంచ్ జడ లావణ్య కృష్ణ, వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.