మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

165చూసినవారు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, కడెం మండలాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మెన్ భూషణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్