వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

1చూసినవారు
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ మండలం శాంతినగర్, బిర్సాయిపేట్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం ప్రారంభించారు. పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్