
పాస్టర్ ఎస్సీ సర్టిఫికేట్‌ను రద్దు చేయండి: హైకోర్టు
క్రైస్తవ మతంలోకి మారిన పాస్టర్ చింతాడ ఆనంద్ మోసపూరితంగా పొందిన ఎస్సీ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని కోరుతూ బాధితుడు అక్కల రామిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు స్పందించింది. మతం మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారని, పాస్టర్ ఆనంద్ ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ తీర్పు ఇచ్చారు. పాస్టర్ ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ 2025 ఏప్రిల్ 30న తీర్పు వెలువడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ, విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.




