ఖానాపూర్ పట్టణంలోని గుమ్ములవాడ శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీశ్రీశ్రీ వెంకట లక్ష్మి నరసింహ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు కమిటీ సభ్యులు అందజేశారు. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.