జన్నారం మండలంలోని రేండ్లగూడ అనుబంధ రూప్ నాయక్ తండా గ్రామస్తులు తమ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. జన్నారం మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్లు, రేండ్లగూడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా సరైన రోడ్డు మార్గం లేదని, వర్షాకాలంలో మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బీటీ రోడ్డు నిర్మాణంతో తమ ఇబ్బందులు తొలగిపోతాయని వారు తెలిపారు.