ఖానాపూర్ పట్టణంలో శనివారం జరిగిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కక్షతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అనుకూలంగా ఉన్న రేవంత్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హెచ్చరించారు.