ఖానాపూర్ లో శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: పూర్ణాహుతితో ముగింపు

1చూసినవారు
ఖానాపూర్ లోని శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. యజ్ఞాచార్యులు చక్రపాణి నరసింహాచారి, నిమ్మగడ్డ సందీప్ శర్మ ల ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల మధ్య యాగసంప్రోక్షణ అనంతరం అగ్నికి ప్రీతికరమైన ద్రవ్యాలను పూర్ణాహుతికి వినియోగించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు అడ్డగట్ల రాజన్న, ప్రధాన కార్యదర్శి నిమ్మల రమేష్, కోశాధికారి ఉషకోల సుధాకర్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్