శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం: అన్నదానంతో భక్తులకు విందు

0చూసినవారు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శనివారం 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చతుర్థ వార్షికోత్సవాల సందర్భంగా, శతబిష నక్షత్రయుక్త లగ్న పుష్కరాంశ ధనుర్లగ్న సుముహూర్తాన శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం పురోహితుల వేదమంత్రాలు, మేళతాళాల నడుమ వైభవంగా నిర్వహించబడింది. అనంతరం, దేవాలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖానాపూర్ కడం మండల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు, ఇతర ప్రముఖులు కూడా స్వామివారిని దర్శించి ఆశీస్సులు పొందారు.

ట్యాగ్స్ :