ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు పటేల్, మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సమక్షంలో శనివారం ఖానాపూర్ నియోజకవర్గంలో అత్యాధునిక పరికరాలు, రోబోటిక్ ట్రైనింగ్ మిషన్లతో నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ను ప్రారంభించారు. సుమారు 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో టాటా గ్రూప్ సహకారంతో నిర్మించిన ఈ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు ప్రపంచస్థాయి శిక్షణ అందించి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.