నిర్మల్ జిల్లా ఖానాపూర్ వాసులు వందల ఏళ్లుగా ఆచరిస్తున్న ఒక వింత సంప్రదాయాన్ని నిర్వహించారు. గ్రామంలో జెట్టక్కను (చెడును సూచిస్తూ) చీపుర్లు, చాటలు, పాత బట్టలతో ఊరేగించి, గ్రామ శివారులోని తుమ్మ చెట్లకు కట్టి వదిలివేశారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు పూజలు చేశారు. ఈ ఆచారం ద్వారా ఊరికి, ఇంటికి పట్టిన చెడు తొలగిపోయి, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగలో చీపుర్లు, చాటలు వంటివి ప్రధానంగా కనిపిస్తాయి.