ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 21, 749 క్యూసెక్కుల నీరు విడుదల

61చూసినవారు
ఎగువన గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు. ప్రస్తుతం 699 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో గా 25, 403 క్యూసెక్కుల నీరు చేరుతున్న క్రమంలో, 21, 749 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you