
మద్యం మత్తులో ఇద్దరు పిల్లలను చంపిన తండ్రి!
మద్యం మత్తులో కన్న తండ్రే ఇద్దరు పిల్లలను దారుణంగా పొట్టనబెట్టుకున్న సంఘటన త్రిపురలోని ధలాయ్ జిల్లా గండచేర్రా పరిధిలోని ఉల్తాచ్ఛారా గ్రామంలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు లాల్ చువానామా బ్రూ తన భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె తన పిల్లల్లో ఒకరిని తీసుకుని పారిపోగా.. ఇంట్లో ఉన్న 4 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తెపై లాల్ కర్రతో దారుణంగా దాడి చేయడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.




