ఖానాపూర్ మండల్ కడెం లోని కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగా, ధ్యానం, వ్యాయామం చేయిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆత్రం విజయ పిఈటి ఆధ్వర్యంలో ఈ శిక్షణ అందిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థినులు మానసిక ప్రశాంతతతో పాటు శారీరకంగా మంచి ఫలితాలు పొందుతారని, చదివింది గుర్తుంచుకోవడానికి, చలాకీగా ఉండటానికి యోగా, వ్యాయామం దోహదపడతాయని తెలిపారు.