Jan 20, 2026, 20:01 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్ ఉత్సవాల్లో విద్యార్థుల ప్రతిభ, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు
Jan 20, 2026, 20:01 IST
నిర్మల్ 2026 సాంస్కృతిక ఉత్సవాల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని ప్రైస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. 6వ తరగతి విద్యార్థి సయ్యద్ ఖిజర్, 7వ తరగతి విద్యార్థిని నూరా ఫాతిమా బృందం నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనకు ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా డీఈఓ భోజన గారు విద్యార్థులను అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మురాద్ గారు, సిబ్బంది, ఉపాధ్యాయులు గణేష్ సార్ విద్యార్థులను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.