మంచిర్యాల: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

899చూసినవారు
మంచిర్యాల: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మల్యాల చిరంజీవి అనే వ్యక్తి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం లేకపోవడం, స్నేహితుల వద్ద తీసుకున్న రూ.5 లక్షల అప్పులు తీర్చలేక మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం భార్య, పిల్లలను పాఠశాలలో వదిలి ఇంటికి వచ్చిన చిరంజీవి, సాయంత్రం భార్య పాఠశాల నుండి పిలిపించుకోవడానికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లిన భార్య అతడిని ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్