
తానూర్-మొగిలి రహదారికి రూ.3 లక్షల గ్రావెల్ నిధులు మంజూరు
తానూర్ నుండి మొగిలి వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ముధోల్ మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుమారు 3 లక్షల రూపాయల గ్రావెల్ నిధులు మంజూరు అయ్యాయి. గ్రామస్తులు రోడ్డు పనులను ఉత్సాహంగా ప్రారంభించారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మొగిలి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.







































