స్వచ్ఛతలో భాగస్వామ్యం–స్వచ్ఛ
భారత్, వికసిత్
భారత్’ నినాదంతో స్వచ్ఛతా హి సేవా–2026 కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన ముథోల్ మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. మట్టి గణపతి విగ్రహాలతో పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాల వల్ల నీటి వనరులు, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావాలను సిబ్బంది ప్రజలకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు.