బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావు పాటిల్ గురువారం హైదరాబాద్ లోని పలువురు మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం పట్టణంలో వ్యవసాయ మార్కెట్ పనుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని వారిని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.