
అమరావతి బిల్లుకు లోక్సభలో కాంగ్రెస్ మద్దతు
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మౌనంగా ఉండబోమని, అమరావతికి మద్దతుగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.




