బాసర: మోకాలిపై కూర్చొని కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

65చూసినవారు
బాసర త్రిబుల్ ఐటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్రమబద్ధీకరణకు డిమాండ్ చేస్తున్న
నిరసన నాలుగవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శనివారం మోకాలిపై కూర్చొని ప్రభుత్వాన్ని తమ సేవలను క్రమబద్ధీకరించాలని విన్నవించారు. అన్ని అర్హతలు ఉన్న తమని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, కృష్ణ ప్రసాద్, ఖలీల్, రవికుమార్, శంకర్, కాశన్న, విట్టల్, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you