వచ్చేనెల 6న బాసరకు సీఎం రేవంత్ రెడ్డి

1చూసినవారు
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఏప్రిల్ 6న బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో, సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి సమీక్షించారు. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక ఆహ్లాదక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని కమిషనర్ తెలిపారు. పలు నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాలను పరిశీలించి, ఆలయ ప్రాంగణంలో నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. పనుల ప్రారంభోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ముఖ్యమంత్రి నిర్వహించే పూజలకు సంబంధించిన వివరాలను చర్చించారు.

సంబంధిత పోస్ట్