ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ కిష్టయ్య చేతుల మీదుగా డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబా లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయో జనాలు అందించాలనే లక్ష్యంతో డిజిటల్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేస్తోం దన్నారు. కార్డుల ద్వారా లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు