పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

402చూసినవారు
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోళ్ళ దత్తాద్రి, వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్