శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల 28 ప్యాకేజీకి రూ. 300 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. తానూర్, కుబీర్ మండలాలకు సాగునీరు అందక ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్నాయని, 500 కోట్ల నిధులతో అప్పట్లో 60 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పనులు పూర్తి చేయడానికి మరో 300 కోట్లు అవసరమని, దీంతో 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన అన్నారు.