కుంటాల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణలో హెల్త్ సూపర్వైజర్ సుజాత ఆధ్వర్యంలో బుధవారం కుష్టు వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. అనంతరం లెప్రసి ప్రతిజ్ఞను చేశారు. ఇందులో వైద్యులు అమృతయాని, ఏఎన్ఎంలు బబిత, విజయలక్ష్మి, అంగన్వాడీ జ్యోతి, ఆశా కార్యకర్త అరుణ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.