భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీతో ఆధునిక వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, రైతుల అభివృద్ధిని ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.